![]() |
![]() |
.webp)
సోషల్ మీడియాలో గంగవ్వకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఆమె గురించి తెలియని ఆడియన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరు. మై విలేజ్ షో ద్వారా గంగవ్వ ఫుల్ ఫేమస్ అయ్యింది. అలాగే ఎన్నో మూవీస్ లో నటించింది. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళింది. అలాంటి గంగవ్వ రీసెంట్ గా ఒక ఒక ఇంటర్వ్యూకి వచ్చింది. అందులో పాపం తన బాధలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఐతేే ఈ ఇంటర్వ్యూలో హోస్ట్ ఎంతమంది పిల్లలు గంగవ్వా నీకు అని అడిగేసరికి "నాకు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు. అందులో ఒక అమ్మాయి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడే ఫైట్స్ వచ్చి చనిపోయింది. ఒక అబ్బాయి కూడా చనిపోయాడు.
నేను ఈ వయసులో బిగ్ బాస్ కి వెళ్లడం సినిమాలు చేయడం చూస్తున్న నా ఫ్రెండ్స్ కు కడుపు ఉడికిపోతోంది. నాకు చదువన్నదే తెలీదు. ఇక సినిమాలకు వాటికి సంతకం పెట్టాలంటే ఇలా పెడతా. అది వాళ్లకు అర్ధమవుతుంది. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు." అని చెప్పింది. "ఒక వేళా దేవుడు ప్రత్యక్షమై మీ అమ్మను నాన్నను మళ్ళీ కిందకి పంపిస్తానంటే ఎం చేస్తావ్" అని హోస్ట్ గంగవ్వని అడిగింది. "అమ్మ నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతా. నాకు మా అమ్మకు, నాన్నకు ప్రేమగా అన్నం కలిపి పెట్టాలనిపిస్తోంది. కానీ అలా వస్తారా..రారు కదా" అని చెప్తూ అందరినీ ఏడిపించేసింది. ఇక గంగవ్వ తన సంతకం ఎలా ఉంటుందో చేసి చూపించింది. అందరి సంతకాలు వేరుగా ఉంటాయి తన సంతకం వేరుగా ఉంటది కదా ఎవరైనా గుర్తుపడతారు అని చెప్పింది గంగవ్వ. అలాగే చిన్న గౌన్ వేసుకున్న వర్ష ఫోటో ఛీ యాక్ అనేసింది.
![]() |
![]() |